మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో వివాహానికి బయలుదేరిన బాలికపై లైంగిక దాడి జరి గినట్లు నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
కురుపాం: మండలంలోని ఏజెన్సీ ప్రాంతంలో వివాహానికి బయలుదేరిన బాలికపై లైంగిక దాడి జరి గినట్లు నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు ఎల్విన్‌పేట సీఐ వేణుగోపాలరావు ఆదివారం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నారుు.. ఒబ్బంగి పంచాయతీ రెల్లిగూడకు చెందిన ఓ బాలిక (17) శనివారం సాయంత్రం దండుసూర గ్రామం లో జరగనున్న వివాహానికి బయలుదేరింది. ఈ సందర్భంగా దండుసూర గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై వచ్చి తమతో రమ్మని కోరారు.
ఆ యువకులు తనకు తెలియ డంతో బాధితురాలు వారితో పాటు వెళ్లగా, మార్గమధ్యలో మండంగి కుమార్ (23) అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆదివారం ఉదయం బాధితురాలు కుటుంబసభ్యులు, గ్రామపెద్దలతో కలిసి వచ్చి నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలిని పార్వతీపురం ఏరియూ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం పంపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరారీలో యువకులు
ద్విచక్ర వాహనంపై బాలికను తీసుకొని వెళ్లిన ముగ్గురు యువకులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని సీఐ తెలిపారు.