బాలికపై లైంగిక దాడి | Sexual assault on girl | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగిక దాడి

Aug 21 2015 12:49 AM | Updated on Jul 23 2018 9:13 PM

మాయమాటలు చెప్పి ఓ బాలికను ఆమె స్నేహితురాలు, స్నేహితురాలి బావ విజయవాడ తీసుకువెళ్లి లైంగిక దాడి చేసిన ...

గుంటూరు : మాయమాటలు చెప్పి ఓ బాలికను ఆమె స్నేహితురాలు, స్నేహితురాలి బావ విజయవాడ తీసుకువెళ్లి లైంగిక దాడి చేసిన ఘటనపై లాలాపేట పోలీసులు విచారణ చేస్తున్నారు. సేకరించిన సమాచారం మేరకు గుంటూరులోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న రెహనా జాస్మిన్ తనతోపాటు పనిచేసే సంగడిగుంట ఎల్‌ఆర్ కాల నీకి చెందిన బాలిక (17)తో స్నేహంగా ఉండేది. జాస్మిన్ బుధవారం విజయవాడలో షాపింగ్ కోసం తన బావతో పాటు కారులో వెళదామని స్నేహితురాలిని ఒప్పించింది. జాస్మిన్ బావ ఇలియాజ్ కారులో ముగ్గురూ విజయవాడ  చేరుకున్నారు.

విశ్రాంతి కోసం మనోరమ హోటల్‌లో రూములో దిగారు. జాస్మిన్, ఇలియాజ్ కలసి కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి బాలికకు ఇచ్చారు. మత్తులోకి జారుకున్న బాలికపై ఇలియాజ్  లైంగిక దాడికి పాల్పడ్డాడు. మత్తు నుంచి కోలుకున్న అనంతరం ముగ్గురూ గుంటూరు చేరుకున్నారు. తనపై అఘాయిత్యం జరిగిన విషయాన్ని గ్రహించిన బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. వారు గురువారం ఉదయం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు సమాచారం.
 
 

Advertisement
 
Advertisement
Advertisement