విశాఖ వైపు పయనమై మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
విశాఖకు ఆగ్నేయంగా 560 కిలోమీటర్ల దూరంలో నిలకడగా కేంద్రీకృతమైన వాయుగుండం క్రమంగా బలహీనపడుతోంది. ఇది పశ్చిమ దిశగా విశాఖ వైపు పయనించి మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం పోర్టులో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45-50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
ఈ నెల 8,9 తేదీల మధ్య మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కోస్తాంధ్రలో శనివారం నాడు చెదురుమదురు జల్లులు, ఆదివారం ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అన్ని వాతావరణ శాఖ పేర్కొంది.