సర్పంచ్ హత్య కేసులో ఏడుగురి అరెెస్ట్ | seven members are arrest in sarpanch murder case | Sakshi
Sakshi News home page

సర్పంచ్ హత్య కేసులో ఏడుగురి అరెెస్ట్

Jul 1 2014 3:39 AM | Updated on Sep 2 2017 9:36 AM

సర్పంచ్ హత్య కేసులో ఏడుగురి అరెెస్ట్

సర్పంచ్ హత్య కేసులో ఏడుగురి అరెెస్ట్

బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ సర్పంచ్ రవి హత్య కేసును పోలీసులు చేధిం చారు. హత్యకు పాల్పడిన నలుగురు వ్యక్తుల తో పాటు, ప్రోత్సహించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

బెల్లంపల్లిరూరల్ : బెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రా మ సర్పంచ్ రవి హత్య కేసును పోలీసులు చేధిం చారు. హత్యకు పాల్పడిన నలుగురు వ్యక్తుల తో పాటు, ప్రోత్సహించిన మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. సోమవారం సీఐ కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బెల్లంపల్లి సీఐ బాలాజీ, టూటౌన్ ఎస్‌హెచ్‌వో మహేశ్‌బాబు కేసు వివరాలు వెల్లడించారు. కన్నాల గ్రామానికి చెందిన జిల్లపెల్లి శ్రీనివాస్ కన్నాల జాతీయ రహదా రి పక్కనున్న 15 ఎకరాల ప్రభుత్వ భూమిని కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నాడు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కలసి ఆ స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించాలని ప్రయత్నించాడు. దీన్ని కన్నాల సర్పంచ్ రవి అడ్డుకుని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
 
ఈ స్థలం విషయంలో తలదూర్చవద్దని శ్రీనివాస్ రవితో పలుసార్లు చర్చలు జరిపాడు. అయినా సరే రవి వినిపించుకోకుండా జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో శ్రీనివాస్ సర్పంచ్‌పై రవి కక్ష పెంచుకున్నాడు. రవిని ఎలాగైనా అంతమొందించాలని అదను కోసం శ్రీనివాస్ ఎదురు చూశాడు. బెల్లంపల్లి పట్టణానికి చెందిన బండి ప్రభాకర్, ఎండీ హనీఫ్, కన్నాల ఉపసర్పంచ్ జిల్లపెల్లి వెంకటస్వామి, అదే గ్రామానికి చెందిన నాతరి ఎల్లయ్య, భావండ్లపల్లి స్వామిల ప్రోత్సాహంతో రవిని హత్య చేయడానికి కుట్ర పన్నాడు.
 
జూన్ 21న పంచాయతీ కార్యాలయానికి వచ్చిన సర్పంచ్ రవిని శ్రీనివాస్ అదే గ్రామానికి చెందిన జిల్లపెల్లి శివకుమార్, మంతెన కిరణ్‌కుమార్, జిల్లపెల్లి అరవింద్‌తో కలసి గొడ్డలి, ఇనుపరాడ్లు, పునాదిరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు సీఐ తెలిపారు. జిల్లపెల్లి వెంకటస్వామి, ఎండీ హనీఫ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో త్రీటౌన్ ఎస్సై బండారి రాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement