ఎవరెస్ట్‌ అధిరోహణకు ఎంపికలు

selections of mission mount everest - Sakshi

జిల్లాస్థాయి ఎంపికలకు 47 మంది హాజరు

త్వరలో 10 మందితో ఎంపిక జాబితా వెల్లడి

శ్రీకాకుళం న్యూకాలనీ: మిషన్‌ మౌంట్‌ ఎవరెస్ట్‌ అధిరోహణకు ఔత్సాహికులైన అభ్యర్థులకు శుక్రవారం ఎంపికలు నిర్వహించారు. సెట్‌ శ్రీ ఆధ్వర్యంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ సహకారంతో కోడిరామ్మూర్తి స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి ఎంపికలకు 47 మంది హాజరయ్యారు. ఇందులో ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరికి పలు పరీక్షల అనంతరం.. 100 మీటర్ల పరుగు, 2.4 కిలోమీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌ ఈవెంట్స్‌ నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వివరాలు నమోదు చేసుకున్నారు. డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌కుమార్‌ ఎంపికలను నిర్వహించారు. సెట్‌ శ్రీ సీఈవో బి.వి.ప్రసాదరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన 10 మందిని ఎంపిక చేస్తామన్నారు. త్వరలో విజయవాడలో జరగనున్న రాష్ట్రస్థాయి ఎంపికలకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ అధికారి నారాయణరావు, డీఎం అండ్‌ హెచ్‌వో మెడికల్‌ స్టాఫ్, పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top