ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆదివారం అనంతపురంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విభజనకు అనుకూలం అంటూ కేంద్రానికి లేఖ ఇచ్చిన బాబు సిగ్గు లేకుండా సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు వ్యవహారిస్తున్న వైఖరి చుస్తుంటూ మహాభారతంలోని కురుక్షేత్రంలో శకుని పాత్ర గుర్తుకు వస్తుందని అన్నారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ది చెప్పే రోజు చాలా దగ్గరలోనే ఉందని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.