సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం | Seemandhra congress leaders Meeting | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం

Aug 17 2013 5:32 PM | Updated on Sep 1 2017 9:53 PM

సిఎం క్యాంప్ ఆఫీస్లో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది.

హైదరాబాద్: సిఎం క్యాంప్ ఆఫీస్లో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృత రూపం దాల్చుతున్న నేపధ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

రాష్ట్రం విడిపోకుండా ఉండేందుకు భవిష్యత్లో చేపట్టవలసిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల వారి వాదనలను  వినేందుకు ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ ముందు వినిపించవలసిన  వాదనలు గురించి చర్చిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement