'సీమాంధ్ర కేంద్రమంత్రులకు చీము, నెత్తురు లేదు' | Secretariat Seemandhra Employees takes on Seemandhra central ministers | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర కేంద్రమంత్రులకు చీము, నెత్తురు లేదు'

Dec 6 2013 12:58 PM | Updated on Jul 25 2018 4:09 PM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడం పట్ల సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు నిప్పులు చెరిగారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడం పట్ల సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు నిప్పులు చెరిగారు. శుక్రవారం కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు సచివాలయంలో విధులను బహిష్కరించారు. అనంతరం సచివాలయంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సీమాంధ్ర కేంద్ర మంత్రులపై వారు తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు.

 

సీమాంధ్ర కాంగ్రెస్నేతలకు చీము,నెత్తురు లేదని వారు ఆరోపించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే నిజాయితీతో పని చేస్తున్నారని వెల్లడించారు. వైఎస్ జగన్కు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement