అన్వర్ కోసం వేట | searching for Anand | Sakshi
Sakshi News home page

అన్వర్ కోసం వేట

Nov 22 2013 3:54 AM | Updated on Sep 2 2017 12:50 AM

మండలంలోని నీలిపల్లిలో సీ హెచ్(క్లోరల్ హైడ్రేట్) సూత్రదారి అన్వర్‌ను పట్టుకునేందుకు ఎక్సైజ్ అ ధికారుల వేట మొదలైంది.

 మల్దకల్, న్యూస్‌లైన్: మండలంలోని నీలిపల్లిలో సీ హెచ్(క్లోరల్ హైడ్రేట్) సూత్రదారి అన్వర్‌ను పట్టుకునేందుకు ఎక్సైజ్ అ ధికారుల వేట మొదలైంది. గద్వాల కు చెందిన అన్వర్ నీలిపల్లి సమీపంలోని వ్యవసాయ పొలం లో నిల్వచేసిన రూ.10 లక్షల విలువైన 20 క్వింటాళ్ల సీహెచ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే.ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
 
 అన్వర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. సీహెచ్ వ్యాపారం వెనక సూత్రదారులు ఎవరనే విషయమై ఎక్సైజ్ అధికారులు తీగలాగేందుకు రం గంలోకి దిగారు. ఈ రసాయనాన్ని కలిపిన కృ త్రిమకల్లును యథేచ్ఛగా విక్రయిస్తూ లక్షలు గడిస్తున్నారు. మల్దక ల్ మండలం కర్ణాటకలోని రాయిచూర్ జిల్లా గట్టు మీదుగా కేవలం 35 కి.మీ దూరం ఉంది. అటు రాయలసీమ అయి జ, శాంతినగర్, రాజోలి మీదుగా 35 కి.మీ ఉంటుంది.
 
 దీంతో సీహెచ్ వ్యాపారులు నడిగడ్డ ప్రాంతాన్ని కేంద్రబిందువుగా మార్చుకుని వ్యా పారాన్ని కొనసాగిస్తున్నారు. కర్ణాటక నుంచి సీహెచ్‌ను నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్యనేత అనుచరుడు దిగుమతి చేసుకుని పలు ప్రాంతాల్లో కొందరు వ్యాపారుల ద్వారా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు. అన్వర్‌ను ప ట్టుకునేందుకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపడుతున్నారు. కర్ణాటక, రాయలసీ మ, రాష్ట్ర రాజధానికి మూడు బృందాలు తరలివెళ్లినట్లు సమాచారం. అలాగే అతని వెనక ఎవరెవ్వరు ఉన్నారనే విషయంపై విచారణ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఓ నా యకుడి ద్వారా సీహెచ్ వ్యాపారం కొనసాగుతున్నట్లు తెలిసింది.
 
 అన్వర్ దొరికితేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఎక్సైజ్ అధికారులు చె బుతున్నారు. ఇదిలాఉండగా, క్లోరల్ హైడ్రేట్ విక్రయించే వ్యాపారులు కర్ణాటక నుంచి రాయలసీమలోని కర్నూలుకు, అక్కడి నుం చి గద్వాలకు సీహెచ్‌ను చేరవేస్తుంటారు. అయితే గద్వా ల నియోజకవర్గంలో ఎక్సైజ్ అధికారు ల దాడు లు జరిగినప్పుడు కర్ణాటక నుంచి రా యలసీమకు, రాయలసీమలో దాడులు జరిగినప్పుడు కర్ణాటక నుంచి గట్టు మీదుగా మల్దకల్, గద్వా ల ప్రాంతాలకు తరలిస్తూ తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement