ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదులకు సీ–విజిల్‌

Sea-Whistle For Complaints On Irregularities In Elections - Sakshi

సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్‌): సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రత్యేక యాప్‌లను రూపొందించింది. ఓటరు దరఖాస్తు అప్‌లోడ్‌ చేయడంతోపాటు.. ప్రచారం, పోలింగ్‌లో అక్రమాలపై ఈ యాప్‌ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వాహనాల నియంత్రణకు కూడా ప్రత్యేక యాప్‌ వచ్చేసింది. ఎన్నికల కమిషన్‌ అందుబాటులోకి 
తెచ్చిన యాప్‌లు..వాటి ఉపయోగాలు ఇవీ.. 

సి విజిల్‌
- యాప్‌లో పౌరులు/ఓటర్లు మొబైల్‌ నంబర్, చిరునామాతో రిజిస్టర్‌ చేసుకోవలసి ఉంటుంది.  
- నగదు, మద్యం పంపిణీ, బెదిరింపు, ఆస్తులు పాడుచేయడం మొదలైన వాటిని తన కెమెరాతో మాత్రమే తీసి అప్‌లోడ్‌ చేయవచ్చు. గాలరీ నుంచి ఫొటోలను ఇందులో అప్‌లోడ్‌ చేయలేరు. ఒకే పర్యాయం 1 నుంచి 2 ఫొటోలు మాత్రమే అప్‌లోడ్‌ చేయడానికి వీలుంటుంది. కేవలం 2 నిమిషాల వీడియోలను మాత్రమే అప్‌లోడ్‌ చేయగలుగుతారు. ప్రజలు చేసే ఫిర్యాదులపై 100 నిముషాల్లో ప్రాథమిక నివేదికను, 2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను సమర్పిస్తారు. 

సుగం  
ఎన్నికల సమయంలో కొందరు రెండు వాహనాలకు అనుమతులు తీసుకుంటే 4 వాహనాలు తిప్పుతున్న సందర్భాలు ఉన్నాయి. వీటిని నియంత్రించేందుకు ఎన్నికల యంత్రాంగానికి సుగం యాప్‌ దోహదపడుతుంది. ఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రచారం కోసం వినియోగించే వాహనాలు నిబం ధనలకు లోబడి ఉంటున్నాయో.. లేదో ఈ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. వాహనాలకు జీపీఎస్‌ సిస్టమ్‌ విధిగా అమర్చుకోవాల్సి ఉంది.
  
సువిధ  
- నామినేషన్‌ల వరకు రాజకీయ పార్టీలు అనుమతుల కోసం మాన్యువల్‌గా ఆర్‌వోల నుంచి అనుమతులు పొందవచ్చు. నామినేషన్లు వేసిన తరువాత ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే  వాహనాలు, మైక్‌సెట్ల వినియోగానికి, బహిరంగసభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించుకోవడానికి, ఇతరత్రా అనుమతులకు సువిధ యాప్‌ ద్వారా సంబందిత అధికారులకు పంపుకోవచ్చు. దీనిపై 24 గంటల నుంచి 48 గంటల్లో  అనుమతులు ఇస్తారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top