breaking news
Register in online
-
ఎన్నికల్లో అక్రమాలపై ఫిర్యాదులకు సీ–విజిల్
సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్): సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక యాప్‌లను రూపొందించింది. ఓటరు దరఖాస్తు అప్లోడ్ చేయడంతోపాటు.. ప్రచారం, పోలింగ్‌లో అక్రమాలపై ఈ యాప్‌ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. వాహనాల నియంత్రణకు కూడా ప్రత్యేక యాప్ వచ్చేసింది. ఎన్నికల కమిషన్ అందుబాటులోకి తెచ్చిన యాప్‌లు..వాటి ఉపయోగాలు ఇవీ.. సి విజిల్ - యాప్‌లో పౌరులు/ఓటర్లు మొబైల్ నంబర్, చిరునామాతో రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. - నగదు, మద్యం పంపిణీ, బెదిరింపు, ఆస్తులు పాడుచేయడం మొదలైన వాటిని తన కెమెరాతో మాత్రమే తీసి అప్లోడ్ చేయవచ్చు. గాలరీ నుంచి ఫొటోలను ఇందులో అప్లోడ్ చేయలేరు. ఒకే పర్యాయం 1 నుంచి 2 ఫొటోలు మాత్రమే అప్లోడ్ చేయడానికి వీలుంటుంది. కేవలం 2 నిమిషాల వీడియోలను మాత్రమే అప్లోడ్ చేయగలుగుతారు. ప్రజలు చేసే ఫిర్యాదులపై 100 నిముషాల్లో ప్రాథమిక నివేదికను, 2 రోజుల్లో పూర్తి స్థాయి నివేదికను సమర్పిస్తారు. సుగం ఎన్నికల సమయంలో కొందరు రెండు వాహనాలకు అనుమతులు తీసుకుంటే 4 వాహనాలు తిప్పుతున్న సందర్భాలు ఉన్నాయి. వీటిని నియంత్రించేందుకు ఎన్నికల యంత్రాంగానికి సుగం యాప్ దోహదపడుతుంది. ఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రచారం కోసం వినియోగించే వాహనాలు నిబం ధనలకు లోబడి ఉంటున్నాయో.. లేదో ఈ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తారు. వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ విధిగా అమర్చుకోవాల్సి ఉంది. సువిధ - నామినేషన్ల వరకు రాజకీయ పార్టీలు అనుమతుల కోసం మాన్యువల్‌గా ఆర్వోల నుంచి అనుమతులు పొందవచ్చు. నామినేషన్లు వేసిన తరువాత ఎన్నికల ప్రచారం కోసం వినియోగించే వాహనాలు, మైక్సెట్ల వినియోగానికి, బహిరంగసభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించుకోవడానికి, ఇతరత్రా అనుమతులకు సువిధ యాప్ ద్వారా సంబందిత అధికారులకు పంపుకోవచ్చు. దీనిపై 24 గంటల నుంచి 48 గంటల్లో అనుమతులు ఇస్తారు. -
ఇక టీచర్లకూ రేటింగ్!
మెదక్: జిల్లాలో 1,974 ప్రాథమిక, 423 ప్రాథమికోన్నత, 502 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 2,899 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో వివిధ కేటగిరీలకు చెందిన సుమారు 11 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం కింద విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్వశిక్షా అభియాన్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థుల స్థాయి నుంచి ప్రధానోపాధ్యాయుల వరకు వారి సామర్థ్యాలు, పనితీరు అంచనా వేసేందుకు క్వార్టర్లీ మానిటరింగ్ టూల్స్‌ను రూపొందించారు. దీనికింద పాఠశాల మానిటరింగ్, విద్యార్థి ప్రమాణాలతోపాటు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పనితీరును ప్రతి మూడు నెలలకోసారి ఆన్లైన్లో ఉంచుతారు. స్కూల్ మానిటరింగ్ కింద పాఠశాల వివరాలు, ఎస్సీ, ఎస్టీల పిల్లల చదువులు, పాఠ్యేతర అంశాలు, వినూత్న పథకాలు, లైబ్రరీ వినియోగం తదితర అంశాలను నమోదు చేస్తారు. విద్యార్థి పెర్ఫార్మెన్స్ కింద సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్ న మోదు చేస్తారు. అలాగే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పెర్ఫార్మెన్స్ నమోదులో 7 అంశాలుంటాయి. ఒక్కో అంశానికి గరిష్టంగా 4 రేటింగ్ పాయింట్లు ఉంటాయి. వీటిని మొదట ఉపాధ్యాయుడు తనకు సంబంధించిన రేటింగ్‌ను తానే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం వీటిని ప్రధానోపాధ్యాయులు, పాఠశాలకు వచ్చే పర్యవేక్షణాధికారులు మూల్యాంకనం చేస్తారు. ఈ మేరకు ప్రతి మూడు నెలలకోసారి ఏడాదికి నాలుగుసార్లు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. జూన్ నుంచి ఆగస్టు వరకు మొదటి క్వార్టర్, సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 2వ క్వార్టర్, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు 3వ క్వార్టర్, మార్చి నుంచి మే వరకు 4వ క్వార్టర్‌ను నమోదు చేస్తారు. గతంలో ఉపాధ్యాయుల పనితీరుపై ప్రధానోపాధ్యాయులు ఉన్నతాధికారులకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ పంపేవారు. కాని 20 యేళ్లుగా అలాంటి రిపోర్టులకు మంగళం పలికారు. అయితే ప్రస్తుతం రేటింగ్ విధానంతో ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు తమ పనితీరును బేరీజు వేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఉన్నతాధికారులు కూడా తగిన సూచనలిచ్చే ఆస్కారం ఉంటుంది. విద్యా ప్రమాణాలు పెరిగే అవకాశం క్వార్టర్లీ మానిటరింగ్ టూల్స్ ఆన్లైన్ ఆధారంగా విద్యా ప్రమాణాలుపెరిగే ఆస్కారం ఉంది. ప్రతి ఉపాధ్యాయుడు తన పనితీరును, నైపుణ్యాలను బేరిజు వేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం సెకండ్ క్వార్టర్ ఈ నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు మండలాలవారీగా సమావేశాలు ఏర్పాటుచేసి ప్రధానోపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.


