రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వారికి అందించేందుకు వ్యవసాయ అధికారులు కృషిచేయాలని జల్లా వ్యవసాయ శాఖ జేడీఏ నర్సింహ వ్యవసాయ అధికారులకు సూచించారు.
నిజామాబాద్ వ్యవసాయం, న్యూస్‌లైన్ : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను వారికి అందించేందుకు వ్యవసాయ అధికారులు కృషిచేయాలని జల్లా వ్యవసాయ శాఖ జే డీఏ నర్సింహ వ్యవసాయ అధికారులకు సూచించారు. గురువారం నిజామాబాద్ వ్యవసాయ శాఖ డివిజన్ కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ స్థాయి ఏడీఏల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
యంత్రలక్ష్మి పథకం కింద మంజూరు చేసిన నిధులతో రైతులు యంత్రాలను సమకూర్చేందుకు కృషిచేయాలని ఆదేశించారు. జిల్లాలో రూ. 13 కోట్ల నిధులు యంత్రలక్ష్మి పథకం కింద మంజూరైనట్లు తెలిపారు. నిజామాబాద్ డివిజన్‌లో రూ.1.5 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులను నెలాఖరు వరకు ఖర్చు చేయాలని సూచించారు. పథకం కింద రైతులకు ట్రాక్టర్ పరికరాలు, తాడ్‌పత్రిలు, రోటవేటర్లు అందించాలని సూచించారు.
డివిజన్ పరిధిలో పథకం అమలు తీరును ఆయన ఏడీఏ వెంకటలక్ష్మిని ఆయన అడిగి తెలుసుకున్నారు. సమీక్షా సమావేశంలో ఏవోలు కేతావత్ సంతోష్, సురేష్‌గౌడ్, హరినాయక్, శశిధర్‌రెడ్డి,డీడీఏ నర్సింహాచారి, సూపరింటెండెంట్ ప్రసాద్, ఏఈవో దివ్యభార తి, అధికారులు పాల్గొన్నారు.