చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు | sc leaders file complaint against CM Chandrababu Naidu in prasakam district | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై పోలీసులకు ఫిర్యాదు

Feb 9 2016 8:38 PM | Updated on Sep 15 2018 2:43 PM

ఎస్సీలను కించపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలువురు దళితులు మంగళవారం ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఒంగోలు : ఎస్సీలను కించపరుస్తూ మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పలువురు దళితులు మంగళవారం ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సోమవారం చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఈ విధంగా తన అగ్రకుల అహంకారాన్ని వెళ్లగక్కారని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ విధంగా దళితలు అవమాన పడేలా మాట్లాడడం విచారకరమన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement