నగరంలోని శనీశ్వర ఆలయం వద్ద శనివారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన ..
విజయవాడ: నగరంలోని శనీశ్వర ఆలయం వద్ద శనివారం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన దుర్గగుడి ఈవో సూర్యకుమారికి చుక్కెదురు అయింది. శనీర్వర ఆలయంపై హైకోర్టులో స్టే ఉందంటూ ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఈవోను అడ్డుకున్నారు. ఈ వివాదం హైకోర్టులో ఉన్నందున ఆలయాన్ని స్వాధీనం చేసుకోవటానికి వీల్లేదని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. దీంతో ఈవో వెనుదిరిగి వెళ్లిపోయారు.