అక్రమంగా డంప్ చేసిన ఇసుక కుప్పలను పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నక్కపల్లి: అక్రమంగా డంప్ చేసిన ఇసుక కుప్పలను పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం చందనాడలో జరిగింది. వివరాలు.. గ్రామంలోని ప్రభుత్వ భూమిలో డంప్ చేసిన 8 లారీల ఇసుకను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. నదుల్లో దొరికే ఇసుకతో పాటు సముద్రపు ఇసుకను కలిపి అక్రమంగా అమ్మకాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంచిన విషయం తెలుసుకున్న అధికారులు ఇసుక డంప్ లను స్వాధీనం చేసుకన్నారు.