‘శంఖారావా’నికి ఇలా వెళ్లాలి | samaikya shankaravam, parkingsa, routes | Sakshi
Sakshi News home page

‘శంఖారావా’నికి ఇలా వెళ్లాలి

Oct 25 2013 2:43 AM | Updated on Sep 4 2018 5:07 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శనివారం హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో జరుగనున్న

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు శనివారం హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో జరుగనున్న సమైక్య శంఖారావం సభకు తరలివెళ్లే వారి కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్‌లో ప్రవేశించాక అనుసరించడం కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ వసతులు ఏర్పాటు చేశారు.
 
 సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వస్తారని భావిస్తున్న పోలీసులు దీనికి విస్తృత బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించాక అనుసరించడం కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ వసతులు కల్పించారు.
 
 స్టేడియం చుట్టు పక్కల మినహా మిగిలినచోట్ల నిలుపుకోవాల్సిన వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద దిగిపోవాలి. అక్కడ నుంచి వాహనాలు వాటికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలి. కార్యకర్తలు, అభిమానులు మాత్రం కాలినడకన వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. సభ పూర్తయిన తరవాత సైతం ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద నుంచే  తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. సహాయసహకారాలు, సూచనల కోసం విధుల్లో ఉండే వాలంటీర్లు, ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని సంప్రదించవచ్చు.
 
 మార్గాలు, పార్కింగ్స్ ఇలా...
 విజయవాడ, నాగార్జునసాగర్ మార్గాల్లో వచ్చే వాహనాలు నల్లగొండ చౌరస్తా, చాదర్‌ఘాట్, కాచిగూడ ట్రాఫిక్ పోలీసు స్టేషన్, కాచిగూడ రైల్వేస్టేషన్, టూరిస్ట్ హోటల్, బర్కత్‌పుర, క్రౌన్ కేఫ్, బాగ్‌లింగంపల్లి, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రయాణించి ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకోవాలి. కార్యకర్తలు, అభిమానుల్ని అక్కడ దింపి వాహనాలను ఎన్టీఆర్ స్టేడియం, సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement