మార్కెట్లోకి ‘సాక్షి’ టెన్త్‌క్లాస్ బుక్‌లెట్లు | Sakshi Tenth Class Booklets for Telugu Medium Students | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి ‘సాక్షి’ టెన్త్‌క్లాస్ బుక్‌లెట్లు

Published Sat, Dec 28 2013 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM

పదో తరగతి విద్యార్థుల కోసం ‘సాక్షి’ రూపొందించిన టెన్త్‌క్లాస్ బుక్‌లెట్లు విడుదలయ్యాయి. పరీక్షలు మార్చి 27 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థుల కోసం ‘సాక్షి’ రూపొందించిన టెన్త్‌క్లాస్ బుక్‌లెట్లు విడుదలయ్యాయి. పరీక్షలు మార్చి 27 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్షలాది విద్యార్థుల ప్రయోజనార్థం ‘సాక్షి’.. ఆంగ్లం, గణితశాస్త్రం, భౌతిక-రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘికశాస్త్రం సబ్జెక్టుల్లో మొత్తం పది బుక్‌లెట్లను ప్రచురించింది. తెలుగుతోపాటు ఇంగ్లిష్ మీడియంలోనూ అందుబాటులోకి తెచ్చింది.

ఈ పుస్తకాల్లో ప్రారంభంలో ఇచ్చిన ప్రిపరేషన్ గెడైన్స్ విద్యార్థికి సబ్జెక్టుపై పూర్తి అవగాహన పెంపొందిస్తుంది. దీంతోపాటు ప్రతి అధ్యాయం పరిచయం, ముఖ్య నిర్వచనాలు, సూత్రాలు, 1, 2, 4, 5 మార్కుల ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలు, జతపర్చడం, క్విక్ రివ్యూ, బ్లూప్రింట్, ప్రీవియస్ పేపర్లు, మోడల్ పేపర్లు వంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఒక్కో బుక్‌లెట్ ధర రూ.30 మాత్రమే.

ఏ గ్రేడ్ సాధించాలనుకునే ప్రతి విద్యార్థీ కచ్చితంగా చదవాలనే రీతిలో, నిష్ణాతులైన ఉపాధ్యాయుల సహకారంతో తీర్చిదిద్దిన ఈ పుస్తకాలు ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. గతేడాది తెలుగు మీడియంలో రూపొందించిన పుస్తకాలకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి విశేష ఆదరణ లభించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement