కల్తీ మద్యం ఘటనపై సమగ్రవిచారణ చేపడతామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు.
విజయవాడ: కల్తీ మద్యం ఘటనపై సమగ్రవిచారణ చేపడతామని సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. కల్తీ మద్యం మృతుల కుటుంబాలకు సోమవారం రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ విభాగాలు సరిగా పని చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని సీఎం హెచ్చరించారు.