నవరాత్రుల్లో ఆర్జిత రుద్రహోమాలు నిలుపుదల | rudrahomalu stops temporarily in srisailam duration of ganesh chathuedhi | Sakshi
Sakshi News home page

నవరాత్రుల్లో ఆర్జిత రుద్రహోమాలు నిలుపుదల

Sep 13 2015 6:03 PM | Updated on Jul 29 2019 6:07 PM

శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 17న వినాయక చవితి సందర్భంగా ఆర్జిత రుద్రహోమాలను నిలుపుదల చేస్తున్నట్లు ఈఓ సాగర్‌బాబు మంగళవారం తెలిపారు.

శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 17న వినాయక చవితి సందర్భంగా ఆర్జిత రుద్రహోమాలను నిలుపుదల చేస్తున్నట్లు ఈఓ సాగర్‌బాబు మంగళవారం తెలిపారు. 17 నుంచి 26 వరకు ఆర్జిత గణపతి హోమం, రుద్రహోమం, మృత్యుంజయహోమం, నవగ్రహ హోమాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఈఓ సాగర్‌బాబు ఆదివారం తెలిపారు. అయితే టికెట్ల విక్రయ కేంద్రం, ఆన్‌లైన్ నుంచి వీటికి సంబంధించిన ఆర్జిత టికెట్లను నిలుపుదల చేస్తున్నామన్నారు.

ఉత్సవాల ముగిసిన అనంతరం 27 నుంచి ఆర్జిత సేవలన్నీ యథావిధిగా నిర్వహిస్తామని, అలాగే అమ్మవారి ఆలయంలో నిర్వహించే చండీహోమాలు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని తెలిపారు. కాగా వినాయక చవితి సందర్భంగా ఆర్జిత ఉభయాన్ని ప్రవేశపెట్టామని, ఒక్క రోజు రూ. 2,516లు చెల్లిస్తే వారి గోత్రనామాలతో గణపతిపూజ, అభిషేకం, కుంకుమార్చన కల్యాణోత్సవంలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఈఓ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement