తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం: హరీష్‌రావు | RTC workers union will play key role in Telangana Movement, says Harish rao | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం: హరీష్‌రావు

Oct 30 2013 2:20 AM | Updated on Sep 2 2017 12:06 AM

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్ర ఎంతో కీలకమైనదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు

హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు పోషించిన పాత్ర ఎంతో కీలకమైనదని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. టీఎంయూ ఆవిర్భావ దినోత్సవ సభ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజైన కోదండరాం, హరీష్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు దేవీప్రసాద్, విఠల్, కత్తి వెంకటస్వామి, టీఎంయూ నాయకులు తిరుపతయ్య, థామస్‌రెడ్డి, అశ్వథ్థామరెడ్డి, న్యాయవాద జేఏసీ రాజేందర్‌రెడ్డి, దయానంద్‌గౌడ్, ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్లు కోటేశ్వరరావు, వెంకటేశ్వరరావు, రసమయి బాలకిషన్, దర్గ దయాకర్‌రెడ్డి, కాచం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
 టాస్క్‌‘ఫోర్స్’ను సవరించండి  : హరీశ్‌రావు
 రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ బృందంలో అత్యధికులు తెలంగాణ వ్యతిరే కులే ఉన్నారని టీఆర్‌ఎస్ శాసనసభపక్ష ఉపనేత, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు తెలిపారు. కేంద్ర హోంమంత్రి ఆ కమిటీని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. మంగళవారం రవీంద్రభారతిలో జరిగిన ‘తెలంగాణ దళిత బహుజన శక్తి’ ఆవిర్భావ సదస్సు’లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీ వివేక్, బీజేపీ నేత డాక్టర్ కె.లక్ష్మణ్, తెలంగాణ దళిత బహుజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు దేవి రవీందర్, సినీ దర్శక నిర్మాత శంకర్, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement