టీడీపీ ప్రచార ఆర్భాటాలకు ఆర్టీసీ బస్సులు

RTC Buses Used For Advertising Campaigns TDP - Sakshi

సభలు, విహారయాత్రల పేరుతో రూ.కోట్ల బకాయిలు 

నాలుగేళ్లుగా కార్యాలయాల చుట్టూ ఆర్టీసీ అధికారుల ప్రదక్షిణలు

ఆర్టీసీని వెంటాడుతున్న అప్పుల భారం 

అప్పుల భారంతో ఆర్టీసీ ప్రగతి గతి తప్పింది. గత టీడీపీ ప్రభుత్వ సేవలో తరించి నిండా మునిగిం ది. ఆర్టీసీ బస్సులను ప్రభుత్వ సభలు, సమావేశాలకు ఇష్టానుసారంగా వాడుకోవడంతో నష్టాల పాలైంది. ఇందుకు గాను ఆర్టీసీకి ప్రభుత్వం కోట్లాది రూపాయలు బకాయి పడింది. బకాయిలు చెల్లించాల్సిన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా నష్టాల్లో నడుస్తోంది. ప్రస్తుతం ఖర్చులు, కార్మికుల జీతాలు భరించలేని స్థితిలో ఉంది. 

సాక్షి, చిత్తూరు రూరల్‌: టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీని ముంచేసింది. ప్రచార అర్భాటాల కోసం ఆర్టీసీ బస్సులను ఇష్టానుసారంగా వాడుకుంది. సభలు, సమావేశాలు, విహారయాత్రల పేరుతో ఆర్టీసీకి రూ.4 కోట్ల వరకు బకాయిలు పడింది. ఈ బకాయిల వసూళ్లకు నాలుగేళ్లుగా ఆర్టీసీ అధికారులు శాఖల వారీగా ప్రదక్షిణలు చేశారు. చెల్లింపు విషయంలో వివిధ శాఖల అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. దీంతో ఆర్టీసీని అప్పుల భారం వెంటాడుతోంది. బకాయిలు వసూళ్లు కాకపోవడంతో ఏం చేయాలో తెలియక ఆర్టీసీ అధికారులు తలలుపట్టుకుంటున్నారు. జిల్లాలోని 14 ఆర్టీసీ డిపోల్లో మొత్తం 1,378 బస్సులు ఉన్నాయి. ఇందులో పల్లె వెలుగు 583, సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ 422, ఎక్స్‌ప్రెస్‌ 192, అల్ట్రా డీలక్స్‌ 38, సూపర్‌లగ్జరీ 78, ఏసీ 32, మెట్రో సర్వీసులు 33 ఉన్నాయి. ఈ

బకాయిల బస్సు
సర్వీసుల్లో నిత్యం 7 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ఆర్టీసీకి రోజుకు సుమారు రూ.2 కోట్లు ఉంటే.. నెల రూ.55 నుంచి రూ.60 కోట్లకు వరకు ఆదాయం వస్తోంది. అయితే ప్రతి నెలా ఆర్టీసీ ఖర్చులు పోను రూ.6 కోట్లు నష్టం వస్తున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. దీనికి తోడు టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఆర్టీసీ బస్సులను వాడుకుని వదిలేయడంతో ఆర్టీసీకి అప్పుల భారం పెరిగింది. 

ప్రచారం కోసమే..
గత నాలుగేళ్ల కాలంలో ఆర్టీసీ చంద్రబాబు సేవలకు మాత్రమే పరిమితమైంది. ప్రయాణికుల సౌకర్యాలను పక్కనపెట్టింది. ఇష్టానుసారంగా టీడీపీ ప్రభుత్వ సమావేశాలకు, పోలవరం షోలకు బస్సులను మళ్లించారు. అవసరమైనప్పుడల్లా కావాల్సినన్ని బస్సులను పంపించారు. ఇలా తరచూ బస్సులను మళ్లించడంతో జిల్లాలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పట్లో వారికి ప్రైవేటు సర్వీసులే దిక్కుగా మారాయి. 2015 అక్టోబర్‌ నుంచి 2019 వరకు వివిధ ప్రాంతాల్లో జరిగే సభలకు, పోలవరం విహారయాత్రకు మొత్తం 1,292 సర్వీసులను తిప్పించారు.

ఇందుకుగాను జిల్లాలోని వివిధ డిపోలకు టీడీపీ ప్రభుత్వం రూ.4 కోట్లు బకాయిలు పడింది. ఇటీవల ఈ బకాయిల్లో కేవలం రూ.14.64 లక్షలు మాత్రమే చెల్లించింది. 2015 నుంచి బకాయిల కోసం ఆర్టీసీ అధికారులు వివిధ శాఖల వారీగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరకు కోట్లలో ఉన్న బకాయిలను రూ. 14.64 లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం కూడా ఆర్టీసీ అధికారులు వివిధ శాఖలకు ప్రతి రోజూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. 

మరింత భారం..
 ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో నడుస్తోంది. ప్రతి నెలా సుమారు రూ.60 కోట్ల ఆదాయం వస్తుంటే.. ఆదాయం ఖర్చులకు, కార్మికుల జీతాలకు సరిపోవడం లేదు. దీంతో నెలకు రూ. 6 నుంచి 7 కోట్ల వరకు నష్టాలు వస్తున్నట్లు అధికారులు వాపోతున్నారు. ఈ తరుణంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పులు ఆర్టీసీకి మరింత భారాన్ని తెచ్చిపెడుతోంది. సొంత డప్పు కోసం చంద్రబాబు ఆర్టీసీని వాడుకున్నారని, ప్రయాణికుల సేవలను పక్కనబెట్టిన బాబు సేవలో నిమగ్నమైన ఆర్టీసీకి గుణపాఠామని కార్మికవర్గాలు, పలువురు ప్రయాణికులు విమర్శిస్తున్నారు. 

సర్వీసుల్లో నిత్యం 7 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా ఆర్టీసీకి రోజుకు సుమారు రూ.2 కోట్లు ఉంటే.. నెల రూ.55 నుంచి రూ.60 కోట్లకు వరకు ఆదాయం వస్తోంది. అయితే ప్రతి నెలా ఆర్టీసీ ఖర్చులు పోను రూ.6 కోట్లు నష్టం వస్తున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. దీనికి తోడు టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఆర్టీసీ బస్సులను వాడుకుని వదిలేయడంతో ఆర్టీసీకి అప్పుల భారం పెరిగింది. 

ప్రచారం కోసమే..
గత నాలుగేళ్ల కాలంలో ఆర్టీసీ చంద్రబాబు సేవలకు మాత్రమే పరిమితమైంది. ప్రయాణికుల సౌకర్యాలను పక్కనపెట్టింది. ఇష్టానుసారంగా టీడీపీ ప్రభుత్వ సమావేశాలకు, పోలవరం షోలకు బస్సులను మళ్లించారు. అవసరమైనప్పుడల్లా కావాల్సినన్ని బస్సులను పంపించారు. ఇలా తరచూ బస్సులను మళ్లించడంతో జిల్లాలోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పట్లో వారికి ప్రైవేటు సర్వీసులే దిక్కుగా మారాయి. 2015 అక్టోబర్‌ నుంచి 2019 వరకు వివిధ ప్రాంతాల్లో జరిగే సభలకు, పోలవరం విహారయాత్రకు మొత్తం 1,292 సర్వీసులను తిప్పించారు. ఇందుకుగాను జిల్లాలోని వివిధ డిపోలకు టీడీపీ ప్రభుత్వం రూ.4 కోట్లు బకాయిలు పడింది.

ఇటీవల ఈ బకాయిల్లో కేవలం రూ.14.64 లక్షలు మాత్రమే చెల్లించింది. 2015 నుంచి బకాయిల కోసం ఆర్టీసీ అధికారులు వివిధ శాఖల వారీగా కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చివరకు కోట్లలో ఉన్న బకాయిలను రూ. 14.64 లక్షలు చెల్లించి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం కూడా ఆర్టీసీ అధికారులు వివిధ శాఖలకు ప్రతి రోజూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top