ఆర్టీఏ దాడులు: 9 బస్సులు సీజ్ | Rta attack on school buses in krishna distirict | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ దాడులు: 9 బస్సులు సీజ్

Feb 3 2015 12:36 PM | Updated on Sep 2 2017 8:44 PM

నిబంధనలు పాటించని ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు.

విజయవాడ : నిబంధనలు పాటించని బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. కృష్ణా జిల్లాలో మంగళవారం ఉదయం అధికారులు వాహన తనిఖీలు నిర్వహించారు.  ఫిట్నెస్ లేని, నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 9 బస్సులను సీజ్ చేశారు. అదేవిధంగా విజయనగరం జిల్లాలో ముడిగామ్ సమీపంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. అనుమతి లేకుండా నడుస్తున్న నాలుగు స్కూల్ వ్యాన్‌లతో పాటు, 11 బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అర్టీఏ అధికారులు హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement