రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు | Rs 3 crore illegal Property in Motor Vehicle Inspector | Sakshi
Sakshi News home page

రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు

Jun 19 2014 1:57 AM | Updated on Sep 2 2017 9:00 AM

రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు

రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు

కృష్ణాజిల్లా గన్నవరంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బి.వెంకట మురళీకృష్ణ కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు

తాడేపల్లిగూడెం : కృష్ణాజిల్లా గన్నవరంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న బి.వెంకట మురళీకృష్ణ కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రూ.3 కోట్లకు పైగా అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు జిల్లా ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వరరావు తెలిపారు. మురళీకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు అందిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన జిల్లా ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో బుధవారం వేకువ జాము నుంచి రెండు జిల్లాల్లోనూ బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఒంగోలు, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన ఏసీబీ అధికారులు ఎనిమిది బృందాలుగా ఏర్పడి, ఏలూరు డీఎస్పీ ఐ.వెంకటేశ్వరరావు, రాజమండ్రి డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ముర ళీకృష్ణ అక్రమ ఆదాయంతో బినామీల పేరిట విలువైన భవనాలు, షాపులు, స్థలాలు కొనడంతో పాటు, ఫైనాన్స్ కంపెనీలకు సొమ్మును మళ్లించినట్టు అధికారులు ఫిర్యాదులు అందారుు.
 
 దీంతో ప్రాథమికంగా ఏఏ ప్రాంతాల్లో మురళీకృష్ణకు, అతని మామకు (పిల్లనిచ్చిన వ్యక్తి) ఆస్తులు ఉన్నాయో గుర్తించారు. ఆ మేరకు కృష్ణాజిల్లాలో ఆరు చోట్ల, పశ్చిమ గోదావరిలో ఐదు చోట్ల సోదాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా కంకిపాడు రైతు బజారు సమీపంలో రూ.కోటి విలువైన భవనం ముర ళీకృష్ణ పేరు మీద, మొగల్రాజపురంలో మూడు షాపులు అతని మామ పేరు మీద ఉన్నట్టు గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీనితోడు పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెంలో మణి ఫైనాన్స్ కంపెనీలో మురళీకృష్ణ అక్రమార్జనలు మళ్లించినట్టుగా అనుమానాలున్నాయని, దీంతో ఫైనాన్స్ కార్యాలయంలో కొన్ని పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మురళీకృష్ణకు బంధువుగా చెబుతున్న జువ్వలపాలెంలోని ఒక వ్యక్తి ఇంటిలో రాజమండ్రి డీఎస్పీ న ర్రా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సోదాలు చేశారు.
 
 ఇక్కడి నుంచి కొన్ని కాగితాలను అధికారులు వారి వెంట తీసుకెళ్లారు. మామకు దర్శిపర్రు గ్రామంలో ఉన్న ఇంటిని ఏసీబీ అధికారులు సోదా చేశారు. ఇదే మండలంలో మురళీకృష్ణకు స్వగ్రామం ముదునూరు, ఆకుతీగపాడు గ్రామాల్లో ఆస్తులు, తాడేపల్లిగూడెం పట్టణంలో రూ.40 లక్షలు విలువైన స్థలాలు ఉన్నట్టు సోదాల అనంతరం గుర్తించినట్టు జిల్లా ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటే శ్వరరావు తెలిపారు. వీటి విలువ రూ.3 కోట్లకు పైగా ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ఆయన విలేకరులకు తెలిపారు. తనిఖీల్లో ఏసీబీ అధికారులు ఎస్.రామకృష్ణ, గణేష్ (విశాఖపట్నం), లకో్ష్మజీ (విజయనగరం), ఆజాద్ (శ్రీకాకుళం), రాజశేఖర్, సంజీవరావు (తూర్పు గోదావరి) విల్సన్ (పశ్చిమ గోదావరి) పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement