
సాక్షి, వైఎస్సార్ కడప: విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీఎఫ్ జవాను ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన కలకలం రేపుతోంది. ముంబై నుంచి చెన్నై వెళుతున్న మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో విధులు నిర్వహిస్తున్న ఆర్.ఎస్.పన్వర్ గురువారం అర్ధరాత్రి తుపాకీతో కాల్చుకుని మృతి చెందాడు. నందలూరు రైల్వే స్టేషన్‌లో అతన్ని పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కడప నుంచి ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ దాటాక ఈ ఘటన జరిగినట్లుగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
చదవండి: