గర్భిణీని 6 కి.మీ. మోసిన జవాన్లు

రాయ్‌పూర్: నిండు గర్భిణీని సీఆర్‌పీఎఫ్ జవాన్లు సుమారు 6 కిలోమీటర్లు మోసుకుంటూ తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మూరుమూల పల్లె పడెడలో మంగళవారం జరిగింది. 85వ బెటాలియన్‌కు చెందిన జవాన్లు ఆమెను మంచంపై మోసుకుంటూ వెళ్లినట్లు అధికారులు తెలిపారు. పెట్రోలింగ్‌లో భాగంగా ఆ గ్రామనికి వెళ్లిన జవాన్లకు.. గ్రామస్తులు ఆమె గురించి చెప్పారు. వెంటనే వైద్య సహాయం అవసరం అని చెప్పడంతో ఆమెను మంచంపై మోసుకుంటూ బిజాపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె వైద్య పర్యవేక్షణలో ఉందని అధికారులు తెలిపారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి