విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలంలోని ఓ నగల దుకాణంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది.
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా యలమంచిలి మండలంలోని ఓ నగల దుకాణంలో ఆదివారం రాత్రి చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. యలమంచిలి మండలంలోని 'గాయత్రి జుయెలర్స్' అనే నగల దుకాణంలో గోడకు కన్నం వేసి దుకాణంలో ఉన్న 150 గ్రాముల బంగారం, రూ.50 వేల నగదును దొంగిలించారు. సోమవారం ఉదయం యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.