వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత దొంగలు పలు సెల్‌ఫోన్ దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు.
సెల్‌ఫోన్ దుకాణాల్లో భారీ చోరీ
Jan 26 2016 9:00 AM | Updated on Aug 30 2018 5:27 PM
బద్వేలు అర్బన్: వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత దొంగలు పలు సెల్‌ఫోన్ దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. సిద్ధవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్‌లో ఉన్న ఎస్‌ఎంఆర్ సెల్‌పాయింట్ షట్టర్ తాళాలు పగులగొట్టి రూ.5 లక్షల విలువైన సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను ఎత్తుకు పోయారు. అలాగే, సీఎస్‌ఐ చర్చి కాంప్లెక్స్‌లో ఉన్న ఫ్రెండ్స్ సెల్ వరల్డ్ దుకాణంలోనూ రూ.50 వేల విలువ చేసే సెల్‌ఫోన్లు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు చోరీలు జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. క్లూస్‌టీమ్‌కు సమాచారం అందించి దర్యాప్తు ప్రారంభించారు.
Advertisement
Advertisement