'ఇలాంటి నష్టం భవిష్యత్లో ఏ వ్యక్తికి రాకూడదు' | Road Accidents on National Highways, will change the NH: chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ఇలాంటి నష్టం భవిష్యత్లో ఏ వ్యక్తికి రాకూడదు'

Dec 7 2014 9:32 AM | Updated on Aug 30 2018 3:56 PM

'ఇలాంటి నష్టం భవిష్యత్లో ఏ వ్యక్తికి రాకూడదు' - Sakshi

'ఇలాంటి నష్టం భవిష్యత్లో ఏ వ్యక్తికి రాకూడదు'

జాతీయ రహదారుల విధానంలో మార్పులు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్

హైదరాబాద్ :  జాతీయ రహదారుల విధానంలో మార్పులు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరగనున్న ముఖ్యమంత్రుల సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు ఆదివారం ఉదయం ఢిల్లీ బయల్దేరారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ  డివైడర్లు, ఎన్హెచ్లను ఆనుకుని ఉన్న దారులను ప్రక్షాళన చేయాలన్నారు.

జాతీయ రహదారుల వ్యవస్థ సరిగా లేకుంటే మరెన్నో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. హరికృష్ణ కుటుంబానికి శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఇలాంటి నష్టం భవిష్యత్తులో ఏ వ్యక్తికీ రాకూడదని ఆయన అన్నారు. కాగా నల్గొండ జిల్లాలో శనివారం  సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ తనయుడు జానకిరామ్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement