అద్దె బస్సులపై ‘వాణిజ్య’ కొరడా! | Rental of buses 'commercial' scourge! | Sakshi
Sakshi News home page

అద్దె బస్సులపై ‘వాణిజ్య’ కొరడా!

Feb 4 2016 12:15 AM | Updated on Sep 3 2017 4:53 PM

అద్దె బస్సులపై ‘వాణిజ్య’ కొరడా!

అద్దె బస్సులపై ‘వాణిజ్య’ కొరడా!

జిల్లా వ్యాప్తంగా ఐదు ఆర్టీ సీ డిపోల పరిధిలో సుమారు 124 అద్దెబస్సులు నడుస్తున్నా యి.

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
 జిల్లా వ్యాప్తంగా ఐదు ఆర్టీ సీ డిపోల పరిధిలో సుమారు 124 అద్దెబస్సులు నడుస్తున్నా యి. కండక్టర్ ఆర్టీసీకి చెంది, డ్రైవర్ ప్రైవేట్ వ్యక్తిగా కిలోమీటర్‌కు రూ.11 చొప్పున అద్దె బస్సుల నిర్వహకులు ఆర్టీసీ యాజమాన్యం నుంచి ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. అయితే గూడ్స్ పర్సంటేజ్, హైర్ ట్రాన్స్‌పోర్ట్ యాక్ట్స్ కింద అద్దెబస్సు యజమానులు వాణిజ్యపన్నుల శాఖకు నెలవారీ పన్ను చెల్లించాలి. ప్రభుత్వం నుంచి వసూలవుతున్న మొత్తంలో ఖర్చులు పోనూ టీడీఎస్ (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) పేరిట లెక్కలు చూపించాలి. వ్యాట్ కింద ఇలా సుమారు రూ.11 లక్షల చొప్పున ఆరుగురు అద్దె బస్సుల నిర్వహకులు వాణిజ్యపన్నుల శాఖకు బకా యి పడ్డారు.

మూడు ప్రాంతాల పరిధిలో సుమారు రూ.70 లక్షల మేర బకాయి పేరుకుపోవడంతో అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం చేశారు. అయినా నిర్వహకులు పట్టించుకోకపోవడంతో బస్సుల్ని సీజ్ చేసి పోలీసుల అధీనంలో ఉంచేశారు. దీంతో తమకు కొంత గడువిస్తే పన్ను మొత్తాల్ని చెల్లించేస్తామని ఆర్టీసీ అద్దె బస్సుల నిర్వహకులు కాళ్ల బేరానికి వస్తున్నారు. విచిత్రమేమిటంటే కొంతమంది నిర్వహకులు వాణిజ్యపన్నులశాఖకు బకాయి కట్టకుండానే ఆయా బస్సుల్ని ఇతరులకు అమ్మేయోచనలోకి వెళ్లిపోయారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై చట్ట ప్రకారం బస్సుల ఎటాచ్‌మెంట్‌కు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement