రేలంగి కుమారుడు సత్యనారాయణ కన్నుమూత | relangi venkata ramaiah son satyanarayana babu died | Sakshi
Sakshi News home page

రేలంగి కుమారుడు సత్యనారాయణ కన్నుమూత

Dec 27 2013 2:25 AM | Updated on Aug 28 2018 4:30 PM

రేలంగి కుమారుడు సత్యనారాయణ కన్నుమూత - Sakshi

రేలంగి కుమారుడు సత్యనారాయణ కన్నుమూత

ప్రముఖ హాస్య నటుడు దివంగత రేలంగి వెంకట్రామయ్య ఏకైక కుమారుడు రేలంగి సత్యనారాయణబాబు బుధవారం కన్నుమూశారు.

హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రముఖ హాస్య నటుడు దివంగత రేలంగి వెంకట్రామయ్య ఏకైక కుమారుడు రేలంగి సత్యనారాయణబాబు బుధవారం కన్నుమూశారు. ఈ నెల 18న ఆయనకు గుండెనొప్పి రావడంతో హైదర్ గూడలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 10.30కి ఆయన తుది శ్వాస విడిచారు.

రెండేళ్ల క్రితం చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చిన సత్యనారాయణబాబు ఇందిరాపార్కు సమీపంలోని ఎల్‌ఐసీ కాలనీలో ఉంటున్నారు. ఆయనకు సతీమణి కుసుమకుమారితో పాటు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. బన్సీలాల్‌పేట శ్మశానవాటికలో గురువారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలు జరిగాయి.

సత్యనారాయణ బాబు 17 ఏళ్ల వయసులో (సుమారు 1951-52) బాలానందం సినిమాలో హీరోగా చేశారు. ఈ చిత్రంలో రెండవ హీరోగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్ కందా నటించారు. సమాజం, చట్టాలు మారాలి సినిమాలకు సత్యనారాయణబాబు నిర్మాత. తండ్రి సూచనల మేరకు సినిమా పరిశ్రమను వదలి ఆయన వ్యాపారంలో స్థిరపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement