ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం అక్రమ రవాణాకు బ్రేక్ పడడం లేదు.
కర్నూలు: ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎర్రచందనం అక్రమ రవాణాకు బ్రేక్ పడడం లేదు. కర్నూలు జిల్లా చాగలమర్రి మండల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతంలో అక్రమంగా నిల్వ ఉంచిన 21 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు సోమవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. చిన్నవంగలి రేకుల బ్రిడ్జి సమీపంలోని అటవీ ప్రాంతంలో పొదల్లో ఈ దుంగలను నిల్వ ఉంచగా... ఫారెస్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది గాలింపు చర్యల్లో వెలుగు చూశాయి.
వీటి విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని అంచనా.