రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం | Red Sanders worth Rs.3 Crore seized at chittoor district | Sakshi
Sakshi News home page

రూ.50 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం

Mar 17 2016 8:50 AM | Updated on Sep 3 2017 7:59 PM

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట కేఎంఎం కళాశాల ప్రాంతంలో గురువారం టాస్క్ఫోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేట కేఎంఎం కళాశాల ప్రాంతంలో గురువారం టాస్క్ఫోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 28 ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే టవేరా వాహనంతోపాటు ఎర్రచందనం కూలీలకు చెందిన బియ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

అయితే పరిసర ప్రాంతాల్లో ఎక్కడ ఎర్రచందనం కూలీల జాడ మాత్రం తెలియరాలేదు. తమను  గమనించి కూలీలు పరారైనట్లు టాస్క్ఫోర్స్ పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 50 లక్షలు ఉంటుందని టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. టాస్క్ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement