రేషన్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు! | ration portability system to be held in andhra pradesh very soon | Sakshi
Sakshi News home page

రేషన్ ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు!

May 2 2015 11:20 PM | Updated on Sep 3 2017 1:18 AM

లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడకు సమీపంలోని చౌకధరల దుకాణం వద్ద రేషన్ సరుకులను తీసుకోగల సౌలభ్యం త్వరలో ఏపీలో అమలు కాబోతుంది.

శ్రీకాకుళం: లబ్ధిదారులు ఎక్కడ ఉంటే అక్కడకు సమీపంలోని చౌకధరల దుకాణం వద్ద రేషన్ సరుకులను తీసుకోగల సౌలభ్యం త్వరలో ఏపీలో అమలు కాబోతుంది. రేషన్ పోర్టబులిటీ విధానాన్ని ఈ పాస్ యంత్రాల ద్వారా అందుబాటులోకి తేనున్నామని రాష్ర్ట పౌర సరఫరాల సంస్థ కమిషనర్ బి.రాజశేఖర్ చెప్పారు. శనివారం శ్రీకాకుళం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఈ పాస్ విధానం క్రిష్ణా జిల్లాలో పూర్తి స్థాయిలో విజయవంతమైందని... అగస్టు నాటికి రాష్ర్ట వ్యాప్తంగా పోర్టబులిటీ సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

 

తాత్కాలికంగా వలస వె ళ్లినవారు, వేరే పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు తమ రేషన్ కోటాను ఉన్నచోటే పొందే అవకాశం దీని వల్ల లభిస్తుందన్నారు. ఆయనతో పాటు జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, డీఎస్‌ఓ సీహెచ్ ఆనంద్‌కుమార్‌లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement