రాంబాబు ఎక్కడ..? | Ramu babu w r u ? | Sakshi
Sakshi News home page

రాంబాబు ఎక్కడ..?

Jan 17 2015 3:09 AM | Updated on Sep 5 2018 3:37 PM

విద్యుత్ వైర్ల కుంభకోణంలో ప్రధాన నూత్రధారి రాంబాబు ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు.

 విజయనగరం క్రైం: విద్యుత్ వైర్ల కుంభకోణంలో ప్రధాన నూత్రధారి రాంబాబు ఆచూకీని పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. రాంబాబు దొరికితేనే ఈ కేసు ఓ కొలిక్కి వస్తుంది. రాంబాబు కోసం విజయనగరం పోలీసులను రెండు సార్లు హైదరాబాద్‌కు పంపించారు. రాంబాబు హైదరాబాద్‌లో పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే... గత ఏడాది డిసెంబర్ 9న పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని పీఎస్‌ఆర్ కాంప్లెక్స్‌లో విద్యుత్ విభాగానికి చెందిన వైర్లు పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించి కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు తరలించడానికి సిద్ధంగా ఉన్న 90 వైర్ల బండిల్స్, 2 ఆయిల్ డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి మొదటిలో హడావుడి చేసిన పోలీసులు తర్వాత మిన్నకుండిపోయా రు. విద్యుత్ వైర్ల అక్రమ రవాణా విషయంలో విద్యుత్‌శాఖ ఏఈలతోపాటు కొంతమంది సిబ్బందిని వన్‌టౌన్ పోలీసులు విచారించారు. జిల్లాలో ఎక్కడికైనా విద్యుత్ పరికరాలు పంపించాలంటే నెల్లిమర్ల స్టోర్స్ నుంచి సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో విద్యుత్ వైర్ల అక్రమ రవాణా అనేది చాలా ఏళ్లనుంచి జరుగుతున్నట్లు ఆశాఖ అధికారులు గుర్తించారు.
 
 నత్తనడకన విచారణ..
 విద్యుత్ వైర్ల అక్రమ రవాణా కేసు విచారణ నత్తనడకన సాగుతున్నట్లు తెలుస్తోంది. మొదటిలో హడావుడి చేసిన పోలీసులు తర్వాత నెమ్మదించారు. కేసు అసలైన సూత్రధారిగా భావిస్తున్న రాంబాబు ఇంత వరకు పోలీసులకు దొరకనే లేదు. కేసు విచారణ ఆలస్యమైతే అక్రమార్కులు తప్పించుకునే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు.
 
 రాంబాబు ఎక్కడ..?
 విద్యుత్ వైర్ల అక్రమ రవాణాలో ప్రధాన సూత్రదారిగా ఉన్న రాంబాబుకు అధికార పార్టీ నాయకులతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అందువల్లే  రాంబాబుకు తప్పించుకుని తిరుగుతున్నట్లు వినికిడి. దీంతో రాంబాబును కేసు నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విద్యుత్ వైర్ల అక్రమ రవాణా కుంభకోణంలో పోలీసులు పూర్తిస్థాయిలో దృష్టి పెడితే రూ.కోట్లల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement