
చందమామలో బొమ్మలా ఉంది!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. ప్రణాళిక సంఘానికి ఇచ్చిన వినతి పత్రాన్ని ఆయన తప్పుబట్టారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. ప్రణాళిక సంఘానికి ఇచ్చిన వినతి పత్రాన్ని ఆయన తప్పుబట్టారు. చంద్రబాబు ఇచ్చిన వినతి పత్రం చందమామలో బొమ్మలా ఉందని ఎద్దేవా చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన...సాధ్యాసాధ్యాలు తెలుసుకోకుండా ప్రణాళికలు వేయడంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సిద్ధహస్తుడని రామచంద్రయ్య విమర్శించారు.
గతంలో చెప్పిన విజన్ 2020ని ప్రజలు తిరస్కరించని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అల్లా ఉద్దీన్ అద్భుత దీపం ఉంటే తప్ప.. దేశ బడ్జెట్ మొత్తం ఇచ్చినా 'విజన్ 2029' ను సాధించలేరన్నారు. ప్రజల్లో ఆశలు రేకెత్తించే కొలదీ అధికార పార్టీకే ఎక్కువ నష్టం వాటిల్లితుందన్నారు.