
సచివాలయంలో ధర్నాలు, ర్యాలీలు నిషేధం
సచివాలయంలో ధర్నాలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
సాక్షి, హైదరాబాద్: సచివాలయంలో ధర్నాలు, ర్యాలీలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ కార్యదర్శి ఎన్.శివశంకర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు సచివాలయంలో ఎటువంటి ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. సచివాలయ గౌరవాన్ని, క్రమశిక్షణను ప్రతి ఉద్యోగి కాపాడేలా వ్యవహరించాలని కోరారు. తెలంగాణ బిల్లు రాష్ట్రానికి వచ్చిన నేపథ్యంలో శుక్రవారం సచివాలయంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీగా ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సచివాలయంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు