పాతాళగంగ పైపైకి..! | Rain improves groundwater level | Sakshi
Sakshi News home page

పాతాళగంగ పైపైకి..!

Dec 7 2013 1:00 AM | Updated on Mar 28 2018 10:59 AM

భూగర్భ జలాలు క్రమంగా పెరుగుతున్నాయి. నాలుగు నెలల నీటి మట్టాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది.

 సాక్షి, రంగారెడ్డి జిల్లా: భూగర్భ జలాలు క్రమంగా పెరుగుతున్నాయి. నాలుగు నెలల నీటి మట్టాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జలాలు అట్టడుగు స్థాయికి పడిపోయాయి. ఇటీవల కురిసిన వరుస వర్షాలతో పరిస్థితిలో మార్పు కన్పిస్తోంది. ప్రస్తుతం జిల్లాలో సగటున 8 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నట్లు జిల్లా భూరగ ్భజల వనరుల శాఖ నివేదికలు చెబుతున్నాయి. రెండు నెలల క్రితం 10మీటర్ల లోతులో ఉన్న నీటి మట్టం ప్రస్తుతం రె ండు మీటర్లు పైకొచ్చినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో చెరువులు, కుంటలు నిండడం, ఇటీవల కురిసిన వర్షాల నేపథ్యంలో కొద్దిరోజుల్లో భూగర్భజలాలు మరింత మెరుగుపడనున్నట్లు భూగర్భ జల వనరుల శాఖ అధికారులు వెల్లడించారు.
 
 పట్టణ మండలాల్లో..
 జిల్లాలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ మండలాల్లో భూగర్భ జలాల పరిస్థితి ఆశాజనకంగా ఉంది. గత సీజ న్‌లో గ్రామీణంలో కంటే పట్టణ మండలాల్లోనే అధిక వర్షపాతం నమోదైంది. నగర శివారు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు కళకళలాడుతున్నాయి. దీంతో భూగర్భజలాలు కాస్త పెరిగా యి. జనా భా దృష్ట్యా భూగర్భ జలాల వినియో గం పట్టణ మండలాల్లో ఎక్కువగా ఉం డడంతో తాజా పరిస్థితి ఇక్కడి ప్రజల కు ఊరటనిస్తోంది. భూగర ్భజల వనరుల శాఖ గణాంకాల ప్రకారం శా మీర్‌పేట మండలంలో అత్యంత తక్కు వ (2.20 మీటర్ల)లోతులోనే జలాలున్న ట్టు చెబుతున్నారు.
 
  కుత్భుల్లాపూర్ లో 2.80మీటర్లు, శేరిలింగంపల్లి పరిధి లో 3.05మీటర్లు, హయత్‌నగర్‌లో 3.35 మీటర్లు, ఘట్‌కేసర్‌లో 3.35మీటర్లు, శంషాబాద్ 5.65మీటర్లు, సరూర్‌నగర్ 6.95మీటర్ల లోతులో భూగర్భజలాలున్నట్లు ఆ శాఖ లెక్కలు చెబుతున్నా యి. మల్కాజిగిరిలో మాత్రం గరిష్టం గా 19.36మీటర్లుగా నమోదు కావడం గమనార్హం. ఇటు గ్రామీణ మండలాల్లోనూ భూగర్భజలాల పరిస్థితి ఆశాజనకంగా మారుతోంది. అయితే ఇటీవ ల కురిసిన వర్షాల ప్రభావం నెల రోజు ల తర్వాత పూర్తిస్థాయిలో కన్పిస్తుంద ని, వచ్చేనెలలో మరింత మెరుగైన నీటి మట్టాలు నమోదయ్యే అవకాశాలు  న్నాయని అధికారులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement