'ఆ ప్రభుత్వాలకు బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారు' | raghu veera reddy takes on chandra babu naidu | Sakshi
Sakshi News home page

'ఆ ప్రభుత్వాలకు బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారు'

Jan 12 2015 1:20 PM | Updated on Mar 18 2019 9:02 PM

'ఆ ప్రభుత్వాలకు  బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారు' - Sakshi

'ఆ ప్రభుత్వాలకు బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రైతుల వద్ద నుంచి 35 వేల ఎకరాల భూమిని తీసుకుని సింగపూర్, జపాన్ దేశాలకు కట్టబెట్టాలని చూస్తున్న బాబు..  ఆ ప్రభుత్వాలకు బ్రోకర్ గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సోమవారం జిల్లాలోని తుళ్లురులో పర్యటించిన అనంతరం రఘువీరా మీడియాతో మాట్లాడారు.

 

పోలీసుల ద్వారా చంద్రబాబు చట్టాన్ని చేతిలో తీసుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా సహించే ప్రసక్తే లేదని రఘువీరా స్పష్టం చేశారు. పంట భూముల్లో మంటలు పెట్టిన వారు.. టీడీపీ ఎమ్మెల్యే అనుచరులేనని విచారణంలో తేలిందని ఆయన తెలిపారు. వారిని అరెస్ట్ చేయకుండా అమాయకులైన రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. రాజధాని బాధిత రైతుల కోసం గుంటూరు, కృష్ణా రైతులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement