సమస్యల పరిష్కారమే ముందున్న లక్ష్యం

Pushpa Srivani Birthday Celebrations Between Fans And Activists - Sakshi

అభిమానులు, కార్యకర్తల నడుమ పుష్పశ్రీవాణి జన్మదిన వేడుకలు

 కురుపాం విజయనగరం : తనను ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల సమస్యల పరిష్కారమే తన ముందున్న లక్ష్యమని ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. ఆమె జన్మదినం సందర్భంగా శుక్రవారం రావాడ కూడలిలో ఉన్న మహానేత దివంగత వైఎస్సార్‌ విగ్రహం వద్ద అభిమానులు, కార్యకర్తల నడుమ కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె భర్త, వైఎస్సార్‌ సీపీ అరకు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు కేకును ఆమెకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాట్లాడుతూ తన భర్త శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, నియోజకవర్గ నాయకులు, ప్రజల సహకారంతో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానన్నారు. భవిష్యత్‌లో గిరిజనులకు వైద్యం, తాగునీరు, రహదారులు, విద్య సక్రమంగా అందేలా పని చేస్తానని చెప్పారు.

కార్యక్రమంలో కురుపాం ఎంపీపీ ఇందిరాకుమారి, జెడ్పీటీసీ పద్మావతి, వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి నాగేశ్వరరావు, ఎంపీటీసీలు గొర్లి సుజాత, రాజేశ్వరి, నీలకంఠాపరం సర్పంచ్‌ మన్మధరావు, పొడి మాజీ ఎంపీటీసీ కామేశ్వరరావు, మండల కో–ఆప్షన్‌ సభ్యుడు షేక్‌ నిషార్‌తో పాటు కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top