నడిరోడ్డుపైనే పల్స్‌పోలియో కార్యక్రమం | Pulse Polio program held in the Middle of a Road | Sakshi
Sakshi News home page

నడిరోడ్డుపైనే పల్స్‌పోలియో కార్యక్రమం

Jan 17 2016 12:48 PM | Updated on Jul 11 2019 5:01 PM

కర్నూలు జిల్లా ఆదోనిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారులకు నడి రోడ్డుపైనే పోలియో వ్యాక్సిన్లు వేయాల్సిన దుస్థితి నెలకొంది.

కర్నూలు జిల్లా ఆదోనిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా చిన్నారులకు నడి రోడ్డుపైనే పోలియో వ్యాక్సిన్లు వేయాల్సిన దుస్థితి నెలకొంది. చిన్నారులకు పల్స్‌పోలియో కార్యక్రమం ఆదివారం దేశవ్యాప్తంగా జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే, ఆదోని పట్టణంలోని కౌడల్‌పేట్ ప్రాంతంలో ఓ నాలుగు స్కూళ్లలో చిన్నారులకు పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించేందుకు వెళ్లిన వైద్య సిబ్బంది అవాక్కయ్యారు. పోలియో నిర్వహించాల్సిన స్కూళ్లు తాళాలు వేసి దర్శనమిచ్చాయి. తమకు ముందుస్తు సమాచారం లేదని విద్యాశాఖ అధికారులు అంటున్నారు. ఎవరి నిర్లక్ష్యమైతేనేమి చిన్నారులకు తాళాలు వేసి ఉన్న స్కూళ్ల ముందు ఎండలోనే వ్యాక్సిన్లు వేయాల్సి వచ్చింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement