నీటి కోసం ధర్నా | Protest for water | Sakshi
Sakshi News home page

నీటి కోసం ధర్నా

Sep 23 2015 10:18 AM | Updated on Aug 30 2018 3:51 PM

నీటి కొరత తీర్చాలంటూ నల్లగొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపాడు క్రాస్‌రోడ్డు వద్ద స్థానికులు బుధవారం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.

నీటి కొరత తీర్చాలంటూ నల్లగొండ జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపాడు క్రాస్‌రోడ్డు వద్ద స్థానికులు బుధవారం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. సుమారు 200 మంది బిందెలతో రహదారిపై బైఠాయించారు. దీంతో సూర్యాపేట - దంతాలపల్లి రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వారానికి ఒక్కసారి కూడా నీటిని అందించడం లేదని, ఈ పరిస్థితుల్లో ఎలా జీవించాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్ నారాయణకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని, అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement