టెక్కలి పోలీసు సబ్‌ డివిజన్‌కు ప్రతిపాదనలు

Proposals for Tekkali Police Sub Division - Sakshi

నరసన్నపేట శ్రీకాకుళం : జిల్లాలోని మూడు పోలీసు సబ్‌ డివిజన్లకు అదనంగా టెక్కలిలో మరో సబ్‌ డివి జన్‌ను ఏర్పాటుకు, కాశీబుగ్గ సబ్‌డివిజన్‌ కేంద్రాన్ని ఇచ్ఛాపురానికి మార్చేందుకు ప్రతిపాదించా మని ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ తెలిపారు. నరసన్నపేట, ఆమదాలవలసల్లో ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా నరసన్నపేట పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. జిల్లాలో గతంలో పొల్చితే కానిస్టేబుళ్ల సంఖ్య బాగా పెరిగిందని, రిమోట్‌ మండలాల్లోనూ అవసరం మేరకు వేశామన్నారు. ఇటీవల 260 మంది కానిస్టేబుళ్లు వచ్చారన్నారు.

తగ్గిన ప్రమాదాలు..

జిల్లాలో 170 కిలోమీటర్ల పొడవునా జాతీయ రహదారిపై మే నెలలో ముగ్గురు మాత్రమే ప్రమాదాల్లో మరణించారన్నారు. ఇతర ప్రమాదాలు చాలా మేరకు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు. గతేడాది మేలో 51 ప్రమాదాలు కాగా, ఈ ఏడాది మేలో 17కు తగ్గాయన్నారు. వీటిని మరింత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

దొంగతనాలు అదుపులో ఉన్నాయని, గుట్కా అమ్మకాలపై పూర్తిగా పట్టుబిగించామని, రహదారిపై అక్రమ రవాణా ను ఎక్కడికక్కడా తనిఖీలు చేస్తూ అడ్డుకుంటున్నామని పేర్కొన్నారు. బెల్ట్‌ షాపులు తగ్గాయని తెలిపారు. ఆటోలు, మినీ వ్యాన్‌ల్లో అధిక లోడ్‌ కేసులు పెడుతున్నామని, డ్రంకన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. 

రాష్ట్రంలో రెండో స్థానంలో కమ్యూనిటీ పోలీస్‌ వ్యవస్థ

జిల్లాలో 2,901 మంది కమ్యూనిటీ పోలీసుల పేర్లు నమోదు చేసుకున్నారని, వీరిలో 410 మం ది వరకూ రోజూ విధులకు వస్తున్నారని ఎస్పీ తెలిపారు. కమ్యూనిటీ పోలీస్‌ వ్యవస్థ నిర్వహిం చడంలో చిత్తూరు తరువాత మనమే ఉన్నామని పేర్కొన్నారు. వీరికి వారి ఇష్టం మేరకే పనులు అప్పగిస్తున్నామని, అమ్మాయిలు కూడా వస్తున్నారని తెలిపారు.

పాలకొండ, రాజాంలో షీ టీంలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతీ సబ్‌ డివిజ న్‌ వద్ద ప్రత్యేక షీటీంలు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు స్టేషన్లలో పోలీస్‌ క్వార్టర్స్‌ శిథిలావస్థలో ఉన్నాయని, నరసన్నపేటలో క్వార్టర్స్‌ దుస్థితి స్వయంగా పరిశీలించానని పేర్కొన్నారు. వీటి మరమ్మతులకు నివేదికలు పంపామన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top