రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు రమణబాబు ఎంపిక | President Police Medal Ramanababu Selection | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు రమణబాబు ఎంపిక

Jan 27 2015 3:04 AM | Updated on Sep 2 2017 8:18 PM

రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు రమణబాబు ఎంపిక

రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు రమణబాబు ఎంపిక

దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశ రక్షణలో విశిష్ట సేవ లు అందజేసినందుకు గా ను టెక్కలి మండలం

పోలవరం(టెక్కలి): గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశ రక్షణలో విశిష్ట సేవ లు అందజేసినందుకు గా ను టెక్కలి మండలం పోల వరం గ్రామానికి చెందిన పి.వి. రమణబాబు రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ యన ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కిరండోల్‌లోని బీఐఓఎ మ్‌లో క్రైమ్ అండ్ ఇంటెలిజె న్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. 1988 సంవత్సరంలో సిఐఎస్‌ఎఫ్‌లో విధుల్లో చేరిన రమణబాబు సుమారు 14 సంవత్సరాలు వివిధ రాష్ట్రాల్లో ఎయిర్‌పోర్ట్ సెక్యురిటీ విభాగంలో పనిచేశారు. ఇప్పటివరకూ 80కు పైగా వివిధ అవార్డులు, రివార్డులు పొందారు.  2012 సంవత్సరంలో కేంద్ర హోంశాఖ మంత్రి చేతుల మీదుగా డెరైక్టర్ జనరల్ డిస్క్‌ను అందుకున్న ఈయన ప్రస్తుతం రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యూరు. మార్చిలో దీన్ని అందుకోనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement