breaking news
Ramanababu
-
రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు రమణబాబు ఎంపిక
పోలవరం(టెక్కలి): గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశ రక్షణలో విశిష్ట సేవ లు అందజేసినందుకు గా ను టెక్కలి మండలం పోల వరం గ్రామానికి చెందిన పి.వి. రమణబాబు రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ యన ప్రస్తుతం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం కిరండోల్లోని బీఐఓఎ మ్లో క్రైమ్ అండ్ ఇంటెలిజె న్స్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు. 1988 సంవత్సరంలో సిఐఎస్ఎఫ్లో విధుల్లో చేరిన రమణబాబు సుమారు 14 సంవత్సరాలు వివిధ రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్ సెక్యురిటీ విభాగంలో పనిచేశారు. ఇప్పటివరకూ 80కు పైగా వివిధ అవార్డులు, రివార్డులు పొందారు. 2012 సంవత్సరంలో కేంద్ర హోంశాఖ మంత్రి చేతుల మీదుగా డెరైక్టర్ జనరల్ డిస్క్‌ను అందుకున్న ఈయన ప్రస్తుతం రాష్ట్రపతి పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యూరు. మార్చిలో దీన్ని అందుకోనున్నారు. -
పాత కక్షలతోనే రౌడీషీటర్ హత్య
టెక్కలి, న్యూస్‌లైన్: పాత కక్షలు.. భూ తగదాలే రౌడీషీటర్ కోళ చంద్రరావు హత్యకు కారణమని ఏఎస్పీ బి.డి.వి.సాగర్ చెప్పారు. టెక్కలికి చెం దిన చంద్రరావును హత్య చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కోళ లవకుమార్, పీత రాము, పీత రమణబాబు, మండల సురేష్, భాస్కర్ బరోడా ఈ హత్య చేశారని తెలిపారు. వీరికి మాజీ సర్పంచ్ కోళ అప్పన్న, అదే వీధికి చెందిన న్యాయవాది కోళ ధనుం జయ శ్రీనివాస్ సహకరించినట్టు తమ విచారణలో తేలిందని వివరించారు. అసలేం జరిగిందంటే.. చేరివీధికి చెందిన చంద్రరావుకు, అదే వీధికి చెం దిన బంధువు కోళ భీమారావు కుటుంబాల మధ్య భూ తగాదాలు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం భీమారావు, అతని కుమారుడు వాసుదేవరావు ను హత్య చేయడంతో పాటు మరో కుమారుడు ఎర్రన్నపై హత్యాయత్నం కేసుల్లో చంద్రరావు నిందితుడు. లవకుమార్‌ను హతుడు, అతని కు మారులు కామేశ్వరరావు, వసంతరావు తరచూ వేధింపులకు గురి చేసేవారు. దీంతో చంద్రరావును మట్టుబెట్టాలని లవకుమార్ పథకం పన్నాడు. ఈ నెల 20న సాయంత్రం 6గంటలకు ద్విచక్రవాహనంపై మెళియాపుట్టి రోడ్డు వైపు వెళ్తున్న చంద్రరావును చేరివీధి సమీపంలోని గొడగలవీధి వద్ద కత్తులతో దాడి చేశారు. కత్తులను సమీపంలోని వంశధార కాలువలో పడేసి పాతనౌపడ రైల్వేస్టేషన్ నుంచి పరారయ్యూరు. నిందితులను ఆముదాలవలస రైల్వేస్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నామని, అందులో ఒకరు పరారీలో ఉన్నారని ఏఎస్పీ వెల్లడించారు.