ఆ భోజనం అధ్వానం

President of District Child Rights Protection Forum Alleges Low Quality Lunch in Public Schools in Vizianagaram District - Sakshi

విజయనగరం టౌన్‌: నగరంలోని బాబామెట్ట ప్రభుత్వ బాలి కోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం అధ్వానంగా ఉందని చైల్డ్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ ఫోరం జిల్లా అధ్యక్షుడు సత్తి అచ్చిరెడ్డి ఆరోపించారు. శనివారం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఆయన మాట్లాడుతూ మనుషులు తినడానికి పనికిరాని భోజనం ఇక్కడ విద్యార్థులకు పెట్టడం చాలా దారుణమన్నారు. పాచిపోయిన అన్నం, సాంబారు కూరల్లో పురుగులు ఉండటంతో చాలామంది విద్యార్థినులు ఇంటి నుంచే క్యారేజ్‌ తీసుకుని రావడం కనిపిస్తోందని పేర్కొన్నారు. కస్పా హైస్కూల్లోనూ,  వి.టి.అగ్రహారం స్కూల్, జొన్నవలస స్కూల్, నెల్లిమర్ల స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి కనబడినట్టు చెప్పారు. నవప్రయాస్‌ సంస్థ ఇంత ఘోరంగా భోజనం పెడుతున్నా... డీఈఓకు స్కూల్‌ హెచ్‌ఎం ఫిర్యాదుచేసినా పట్టించుకోకపోవడం సరికా దన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి నవప్రయాస్‌ సంస్ధపై చర్యలు తీసుకోవాలని, పిల్లలకు శుభ్రమైన ఆహారం అందించాలని కోరారు. స్పందించకపోతే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాలల హక్కుల కమిటీకి ఫిర్యాదు చేసి, విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ సీఆర్‌పీఎఫ్‌ పోరాడుతామని తెలిపారు. కార్యక్రమంలో ఫోరం ప్రధాన కార్యదర్శి సింహాద్రిస్వామి, ప్రవీణ్‌ కుమార్, రాము, కూర్మారావు, స్కూల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top