రేపటి నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి పాదయాత్ర | prasanakumar padha yathra starts to day | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి పాదయాత్ర

Feb 13 2014 3:13 AM | Updated on Sep 2 2017 3:38 AM

త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం నుంచి పాదయాత్ర చేయనున్నారు.

 విడవలూరు, న్యూస్‌లైన్: త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి శుక్రవారం నుంచి పాదయాత్ర చేయనున్నారు. తొలుత మండలంలోని తీర ప్రాంత పంచాయతీ రామచంద్రాపురం నుంచి ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు.
 
 పాదయాత్ర ఇలా
 రామచంద్రాపురం పంచాయతీలోని పొన్నపూడి పెదపాళెంలో శుక్రవారం ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి కొత్తూరు, దళితవాడ, లక్ష్మీపురం, ప్రశాంతగిరి, వెంకటనారాయణపురం, పొన్నపూడి, బుసిగాడిపాళెం, గిరిజనకాలనీ, చంద్రశేఖరపురం, రవీంద్రపురం, రామచంద్రాపురం వరకు సాయంత్రం ఐదు గంటల దాకా నిర్విరామంగా పాదయాత్ర సాగుతుంది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంతో పాటు స్థానిక సమస్యలు ఆయన తెలుసుకుంటారు.
 
 15వ తేదీ మండలంలోని దండిగుంట, వరిణి, వీరారెడ్డిపాళెం, గాదెలదిన్నె గ్రామాల్లో పాదయాత్ర సాగుతుంది. 16, 17, 18వ తేదీల్లో కోవూరు , 22, 23 తేదీల్లో బుచ్చిరెడ్డిపాళెం , 24, 25 తేదీల్లో కొడవలూరు , 26, 27, 28 తేదీల్లో ఇందుకూరుపేట మండలాల్లో పాదయాత్ర సాగుతుంది. ఈ పాదయాత్రకు కోవూరు నియోజకవర్గ పరిధిలోని విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, ఇందుకూరుపేట మండలాల నుంచి భారీగా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలిరానున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement