'విధుల్లో లేకపోతే ఖబడ్దార్..' | poonam mala kondaiah dismisses the doctor in hindupur hospital | Sakshi
Sakshi News home page

'విధుల్లో లేకపోతే ఖబడ్దార్..'

Aug 19 2015 4:17 PM | Updated on Sep 3 2017 7:44 AM

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యుడిపై ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య కఠిన చర్యలు తీసుకున్నారు.

హిందూపురం (అనంతపురం): విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఓ ప్రభుత్వ వైద్యుడిపై ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య కఠిన చర్యలు తీసుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిని పూనం మాలకొండయ్య బుధవారం ఉదయం తనిఖీ చేశారు. ఆ సమయంలో ఆర్థోపెడిక్ వైద్యుడు బాలాజీ విధుల్లో లేరు.

బాలాజీ విధులకు తరచూ గైర్హాజరవుతూ ప్రైవేటు ప్రాక్టీసు చేస్తున్నట్టు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీంతో ఆ వైద్యుణ్ని విధుల నుంచి తొలగిస్తూ ఆమె అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement