పంచె కట్టుతో ఆకట్టుకున్న పొన్నం | Ponnam Prabhakar Glitz in New Avatar | Sakshi
Sakshi News home page

పంచె కట్టుతో ఆకట్టుకున్న పొన్నం

Oct 20 2013 10:19 AM | Updated on Sep 1 2017 11:49 PM

కరీంగనగర్ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సరికొత్త అవతారంలో కనిపించారు. అచ్చ తెలుగు పంచె కట్టుతో అందరి దృష్టిని ఆకర్షించారు.

హైదరాబాద్: కరీంగనగర్ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ సరికొత్త అవతారంలో కనిపించారు. అచ్చ తెలుగు పంచె కట్టుతో అందరి దృష్టిని ఆకర్షించారు. శనివారం సచివాలయానికి పంచె కట్టులో వచ్చిన ఆయన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన రోజువారి వస్త్రధారణకు భిన్నంగా కనిపించడంతో ఆయనను అందరూ ప్రత్యేకంగా చూశారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీదే ప్రధానపాత్ర అని, దీనిపై తెలంగాణలోని కొన్ని పార్టీలు విమర్శలు చేయడం సరికాదని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ అన్నారు. పొత్తు, విలీనం వంటివి పార్టీ పెద్దలు చూసుకుంటార న్నారు. తెలంగాణ జైత్రయాత్ర సభలకు పేర్లు మార్చి, సోనియాగాంధీ అభినందన సభలుగా నిర్వహిస్తామన్నారు.

విభజన అనివార్యం కాబట్టి, సీమాంధ్రులకు న్యాయంకోసం మంత్రులు, ఎంపీలు, ఉద్యోగుల నేతలు కృషిచేయాలని, కేంద్ర మంత్రుల బృందానికి విన్నపాలు చేయడం మంచిదన్నారు. తెలంగాణ మేధావులు, నిపుణులు కూడా మంత్రుల బృందానికి  నివేదికలివ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement