రాజకీయ అనిశ్చితికి కాంగ్రెస్సే కారణం: నారాయణ | political unrest in country due to congress administration: K.Narayana | Sakshi
Sakshi News home page

రాజకీయ అనిశ్చితికి కాంగ్రెస్సే కారణం: నారాయణ

Aug 15 2013 11:17 AM | Updated on Mar 18 2019 7:55 PM

దేశంలో రాజకీయ అనిశ్చితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. నారాయణ ఆరోపించారు.

దేశంలో రాజకీయ అనిశ్చితికి కాంగ్రెస్ పార్టీయే కారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే. నారాయణ ఆరోపించారు. హిమాయత్ నగర్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ... 66 ఏళ్ల భారతదేశ చరిత్రలో రాజకీయాలను కాంగ్రెస్ భ్రష్టుపట్టించిందని అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని పేర్కొన్నారు. రాష్ట విభజనపై ఆ పార్టీ ఏక పక్షం నిర్ణయం తీసుకుని సీమాంధ్రలో ఆందోళనకు కారణమైందని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement