
విభజిస్తే రాజకీయ సన్యాసమే: రాయపాటి
రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్థానిక లోక్సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు శనివారం గుంటూరులో స్ఫష్టం చేశారు.
రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని స్థానిక లోక్సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు శనివారం గుంటూరులో స్ఫష్టం చేశారు. విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర దీక్ష శిబిరాన్ని శనివారం గుంటూరులో ఆయన సందర్శించారు. వారీ చేపట్టిన దీక్షకు తన సంఘీభావాన్ని ప్రకటించారు.
సోమవారం ఆంటోని కమిటీని కలవనున్నట్లు తెలిపారు. ఆ కమిటీకి సీమాంధ్ర మనోభావాలను తెలియజేస్తానని వెల్లడించారు. కాగా గుంటూరు జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం సెగలు మిన్నంటాయి. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్చంధంగా బంద్ పాటిస్తున్నాయి. విద్యాసంస్థలు కూడా మూసివేశారు.